ఆకుకూరల సాగుతో ఆనందంగా ఉన్నా
బీఎస్సీ, బీఈడీ చదివిన సిరిగిరి సోమరాజు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం రెండు మార్కులతో కోల్పోయారు. ప్రైవేటు ఉద్యోగాలు సైతం కొంతకాలం పాటు చేశారు. చివరికి వాటిల్లో దేనిలో సంపతృప్తిగా లేనని గుర్తించి.. వారసత్వంగా వచ్చిన భూమిలో ఆకుకూరల సాగుతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో సోమరాజు గారు ఆకుకూరలు పండిస్తున్నారు. యువత వ్యవసాయంలోకి వస్తే ఎలాంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందనే విషయంతో పాటు తన సాగు అనుభవాలు సైతం తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాల కోసం ఈ కింది వీడియోను చూడండి.