గొర్రె పొట్టేళ్ల పెంపకం చాలా బాగుంది
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన యువ రైతు మన్నెం సైది రెడ్డి.. గత మూణ్నాలుగు సంవత్సరాలుగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్నారు. అంతకు ముందు ముంబైలో కార్ డ్రైవర్ గా పని చేసిన సైది రెడ్డి.. తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో నిమ్మ తోటను సాగు చేస్తూ, అనుబంధంగా పొట్టేళ్లను సైతం పెంచుతున్నారు. ప్రతి ఏటా మూడు లేదా నాలుగు బ్యాచ్ లుగా పొట్టేళ్లు పెంచుతానని.. ఒక్కో పొట్టేలు పెంపకం పై మూడు వేల రూపాయల వరకు మిగులుతుందని చెప్తున్నారు.
సమీప ప్రాంతాల్లోని పశువుల సంతకు వెళ్లి మూడు లేదా నాలుగు నెలల వయసున్న పొట్టేలు పిల్లలను కొనుగోలు చేస్తానని.. వాటిని తెచ్చి మరో మూణ్నాలుగు నెల్ల పాటు తన షెడ్డులో పెంచుతానని వివరించారు. సూపర్ నేపియర్ గడ్డిని పెంచి చాఫ్ కట్టర్ సాయంతో దాన్ని కత్తిరించి పొట్టేళ్లకు ఆహారంగా వేస్తానని.. కొన్నిసార్లు నిమ్మ తోటలో వదిలేస్తానని చెప్పారు. సైది రెడ్డి అనుభవం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద ఉన్న వీడియోను మొత్తం చూడండి.